తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సేవలందించిన మాజీ మండల అధ్యక్షుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని సింగరాయకొండలోని రైల్వే రోడ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని టిడిపి నేత చీమకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులతో కలిసి సత్య, చీమకుర్తి వెంకటేశ్వర్లు చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం, రక్తదాన శిబిరాన్ని సత్య ప్రారంభించగా, యువత స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని 51 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ, సింగరాయకొండ మండల టిడిపిలో ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి, 20 ఏళ్ల పాటు ప్రజాసేవకు అంకితమై పనిచేసిన చీమకుర్తి వెంకటేశ్వర్లు చిరస్మరణీయ వ్యక్తి అని కొనియాడారు. అతనితో మా కుటుంబానికి 45 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు.మండల పార్టీ అధ్యక్షుడిగా ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,