తొలి శుభోదయం కందుకూరు:-
దాత పివిఆర్ ను అభినందించిన ఎమ్మెల్యే
కందుకూరు ఆర్టీసీ బస్టాండ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఉదయం ప్రారంభించారు. పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు 90 వేల రూపాయలు ఖర్చు చేసి 12 సీసీ కెమెరాలు బిగించగా… ఆయనను ఎమ్మెల్యే శాలువ కప్పి అభినందించారు. అంతకుముందు బస్టాండ్ కు విచ్చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు డిపో అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలకు దాతలు చేయూత అందించడం మంచి విషయమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల డిపోలో దొంగతనాలు తగ్గుముఖం పడతాయన్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఈ పథకం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథకం అమలులో భాగంగా అనేక గ్రామాలకు బస్సు సర్వీసులు పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. తన మిత్రుడు, ఆర్టీసీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో కొత్త బస్సులు తీసుకురావడంతో పాటు డిపోలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. డిపో అధికారులు కూడా ప్రయాణికులకు చక్కటి సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే నాగేశ్వరావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఆర్ శ్రీనివాసులు, సిఐ ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, రాష్ట్ర APEWIDC డైరెక్టర్ పోకూరి రాంబాబు, చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, పువ్వాడి మౌనిక, కూనం నరేంద్ర, షేక్ రూబీ, షేక్ రఫీ, షేక్ మున్నా, షేక్ సలాం, గుమ్మ శివ, భవనాసి వెంకటేశ్వర్లు, సవిడిబోయిన వెంకటకృష్ణ, చుండూరి శ్రీనివాసరావు, మేడ మల్లికార్జున, కొత్తూరు సుధాకర్ ,వెంకట సుధీర్, మచ్చ మనోహర్, నల్లూరి సూర్యనారాయణ, నల్లూరి సుబ్బారావు, డి ఏడుకొండలు శివకృష్ణ, బెజవాడ నరేష్, ఎమ్ ఎన్ రెడ్డి, మాధవరావు లక్ష్మయ్య ప్రసాద్ మరియు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు
