తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ స్మార్ట్ జెన్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించబడినవి.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ,గణతంత్రం అనేది ఒక పరిపాలనా విధానం. ఇందులో రాజ్యాధికారం ప్రజలది, వారు ఎన్నుకున్న ప్రతినిధులది. గణతంత్ర రాజ్యంలో దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించబడిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు.. కోట్లాది భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయానికి సజీవ సాక్ష్యం. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం మన రాజ్యాంగం అని వివరించారు.
