తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ,ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ నేరాలు మరియు గంజాయి సంబంధిత అక్రమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, OTP మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, సందేశాలకు స్పందించవద్దని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు.అదేవిధంగా, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడే దిశగా గంజాయి సాగు, రవాణా, విక్రయం మరియు వినియోగం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలు, చట్టపరమైన శిక్షలు గురించి వివరించారు. గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, తమ పరిసరాలలో ఏవైనా అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నివారణలో ప్రజల సహకారమే ప్రధాన ఆయుధమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసు శాఖ తెలియజేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *