తొలి శుభోదయం మార్కాపురం పోలీస్ :-
మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయడం, విద్యార్థినుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెలిగండ్లలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV School) లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, శక్తి యాప్ (Shakti App) వినియోగం, సైబర్ భద్రత అంశాలపై విద్యార్థినులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా పోలీస్ సహాయం ఎలా పొందాలో, యాప్ డౌన్లోడ్ విధానం, ఉపయోగాలు గురించి స్పష్టంగా వివరించారు.అలాగే, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, అనుమానాస్పద లింకులు, ఫేక్ కాల్స్ వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు. వ్యక్తిగత వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని, ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో చట్టపరమైన రక్షణలు ఉన్నాయని, భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని, పోలీస్ శాఖ ఎప్పుడూ తమకు అండగా ఉంటుందని విద్యార్థినులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొనగా, విద్యార్థినులు చురుకుగా పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల భద్రతే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని మార్కాపురం జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.
