నిందితులకు శిక్ష పడటంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం ప్రకాశం:-
జె.పంగులూరు మండలం, కొండమూరు గ్రామానికి చెందిన చిలమకూరి అనంతరెడ్డి (వయసు 33 సం) హత్యకు సంబంధించినది. చిలమకూరి అనంతరెడ్డి(మృతుడు) మరియు అదే గ్రామానికి చెందిన చిలమకూరి వెంకట కృష్ణారెడ్డి @ పెద్ది కృష్ణారెడ్డి(A-1),వయస్సు -35 మధ్య చాలా కాలంగా భూ వివాదం కొనసాగుతోంది. సంఘటనకు కొద్ది రోజుల ముందు మృతుడు నిర్మించిన కాంపౌండ్ వాల్ కారణంగా కృష్ణరెడ్డి అతనిపై పగ పెంచుకున్నారు. 08.04.2019న రాత్రి సుమారు 10:00 గంటలకు, మృతుడు తన స్నేహితుడితో కలిసి బైకు పై రేణంగివరం గ్రామం నుండి కొండమూరు గ్రామం వైపు వెళ్తుండగా, బీమనాడం దిలీప్ రెడ్డి (A-2),వయస్సు -29 ఉద్దేశపూర్వకంగా రోడ్డును అడ్డగించాడు. వెంటనే, ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప రాడ్‌తో A-1 మరియు A-2లు మృతుడి తల మరియు ముఖంపై తీవ్రంగా దాడిచేసి మరణించిన ఘటనలో జె.పంగులూరు పియస్ లో Cr.No.56/2019 u/s 120(B), 302 r/w 34 కింద ఎస్సై కె. అజయ్ కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు లో సహకరించారు. అప్పట్లో ఇంకొల్లు సర్కిల్ సీఐగా, ప్రస్తుతం ఒంగోలు రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న మద్దినేని శేషగిరి రావు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించారు. అనంతరం ఆర్. రాంబాబు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇంకొల్లు సర్కిల్, దర్యాప్తును పూర్తి చేసి గౌరవ న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి. రమేశ్వర్ రెడ్డి ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. పోలీస్ సిబ్బంది సాక్షులను కోర్ట్ లో సమయానుసారం హాజరు పరుస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో పటిష్టమైన గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా సమర్థవంతంగా విచారణ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితులపై నేరనిరూపణ చేసినందున తేది 05.02.2026 న ఒంగోలు గౌరవ మూడో అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీమతి ఏ.పూర్ణిమ గారు నిందితులకు జీవిత ఖైదు శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.5,000/- జరిమానా విధించారు. సదరు కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితుడు శిక్షించబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన పైన ఉన్న దర్యాప్తు అధికారులు మరియు అద్దంకి రూరల్ CI డి. మల్లికార్జునరావు, జె.పంగులూరు SI బి. వినోద్ బాబు, ప్రస్తుతం మద్దిపాడు పి.ఎస్ లో పనిచేయుచున్న ASI-1560 ఎం.కోటేశ్వర రావు మరియు జె.పంగులూరు పోలీస్ స్టేషన్ ASI-746 డి.శ్రీనివాసరావు ముఖ్య పాత్ర పోషించారు.హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్, కోర్టు లైజన్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ప్రత్యేకంగా అభినందించారు.