తొలి శుభోదయం లింగసముద్రం:-

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెలో లింగసముద్రం మండలంలోని ఆశా వర్కర్లందరూ పాల్గొంటారని, శుక్రవారం నాడు ఆషా డే సందర్భంగా, సిఐటియు ఆధ్వర్యంలో లింగసముద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్ కి, సమ్మె నోటీస్ అందజేశారు. ఆశా వర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని, సెలవులు మంజూరు చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, లీడర్లు, కాటా రవణమ్మ, శ్రీలక్ష్మి, సిఐటియు మండల కో కన్వీనర్ ఎస్ కే అలీషా డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఎం సుభాన్, కొప్పోలు నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, 29 చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్ లను విధించడం వల్ల కార్మికులు వీధిలో పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేసి నిరసన వ్యక్తం చేస్తారని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కో కన్వీనర్ ఎస్ కే ఆలీషా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా లీడర్లు, కాటా రవణమ్మ, శ్రీలక్ష్మి, డి మాధవి , చిరు తోటి కోటమ్మ, అనూష, సుల్తాన్ బి, మహాలక్ష్మి దేవి, పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *