తొలి శుభోదయం :-
కరేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ వార్డు మెంబర్ ఆలుచూరి కోటిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల అకాల మరణం నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ బుర్ర మధుసూదన్ యాదవ్ పరామర్శించారు. మరణించిన కృష్ణారెడ్డి రైతుగా గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ సాగు చెరువు,కాలువల విషయంలో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడని రైతులు మధుసూదన్ యాదవ్ కి తెలియజేశారు.. ఈ పరామర్శ కార్యక్రమంలో వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి, కన్వీనర్ సీతారామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుందరమ్మ, ఎంపీటీసీ వినయ్, సర్పంచ్ కృష్ణారావు, పీతా రామకృష్ణ, చౌటూరి మాధవ, మేకన బోయిన చెంచయ్య, సవరం వెంకట్రావు, సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పద్దారెడ్డి, దారా శ్రీను, మాల్యాద్రి, నాంచార్లు తదితరులు పాల్గొన్నారు.