తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల భద్రతను కాంక్షిస్తూ, ఎస్.ఐ (SI) ఆధ్వర్యంలో నెల్లూరు రోడ్డు జంక్షన్, బొట్లగూడూరు, బోడవడ మరియు తిరగలాదిన్నె వంటి ప్రధాన ప్రాంతాలలో రేడియం స్టిక్కర్లు అంటించిన డ్రమ్ములను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో వాహనదారులకు మలుపులు, జంక్షన్లు స్పష్టంగా కనిపించేలా ఈ చర్యలు చేపట్టారు. ఈ రేడియం స్టిక్కర్లు దూరం నుంచే మెరుస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తాయని, దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఎస్.ఐ ఆశాభావం వ్యక్తం చేశారు.