తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

జాతీయ రహదారి 16 పై సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ నియంత్రణ లో ప్రజలు బాధ్యత తీసుకుని పోలీస్ కి సహకరిస్తూ సి సి కెమెరాలు, మైక్ లు అందజేయడం అభినందనీయం అని ఎస్సై బండ్లమూడి మహేంద్ర పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు, ఒంగోలు డి ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మార్గదర్శనం లో జాతీయ రహదారి పై ఉన్న కనుమళ్ళ గ్రామస్తులు బైరపనేని మోహనరావు,మలినేని పున్నయ్య లు పోలీస్ ఇచ్చిన కౌన్సిలింగ్ తో స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు ఉపయోగ పడేవిధంగా శనివారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో సి సి కెమెరాలు, మైక్ లు అందజేశారు. నిత్యం ఈ ప్రాంతం లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రోడ్డు దాటే వారు, వాహన చోదకులకు తగిన సూచనలు హెచ్చరికలు చేసేందుకు ఈ మైక్ లు ఎంతగానో దోహద పడతాయని ఎస్సై పేర్కొన్నారు. మోహనరావు, పున్నయ్య లను ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు రావాలని, ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎస్సై ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *