తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-

భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ తల్లి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో పోలేరమ్మ తల్లి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ మాట్లాడుతూ…. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ తల్లి, ఈ ఆలయానికి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు వస్తుంటారు. నూతన ఆలయ కమిటీ దేవాలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలి. భక్తుల సౌకర్యం కోసం దేవాలయం బయట మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు, కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు చేపడతాం. మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *