తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
దేశంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని కందుకూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలువురు ముస్లిం నేతలు ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 11 సంవత్సరాల పాటు భారత విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని నేతలు పేర్కొన్నారు. పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, మైనార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నజీర్, వార్డు అధ్యక్షులు గౌస్ బాషా, నాయబ్ రసూల్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, పార్టీ నేతలు సయ్యద్ జియావుద్దీన్, కాలేషా, జహీర్, హర్షద్, గౌస్ బాషా, ఖాదర్, హాజీ, వలీబాషా, నాయబ్ రసూల్, రఫీ, బాబు, ఖాదర్, ఆసిఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.