తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
పట్టణంలోని సాయి బాలాజీ పాఠశాల ఎదురు ఈనెల 25వ తేదీన జరగబోవు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇతర అధికారులు ఆదివారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ సమీపంలోనే సీఎం హెలిఫ్యాడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సభ ప్రాంగణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సీఎం చేరుకునే విధంగా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డీఆర్ డీ ఏ పీడీ నారాయణ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఇంచార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు తదితరులు ఉన్నారు.