తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన AR విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్. శ్రీనివాసరావు ఆర్ఎస్ఐ-1638, సర్వీస్ 36 సంవత్సరాలు, మర్రిపూడిపోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎమ్. సలీం,HC.1565, సర్వీస్ 36 సంవత్సరాలు ఇద్దరని శనివారం ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పోలీసు విధుల నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉంటూ విధులపట్ల అంకితభావంతో పనిచేశారన్నారు.
పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వారి పట్ల ప్రేమ, ఆప్యాయతతో ఉండాలని సూచించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఏఆర్ వెల్ఫేర్ సీతారామరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *