తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు దోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీలో కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిని తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను పరిశీలించారు. తనిఖీలలో సరైన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించి, ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అలాగే, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.