తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం 19వ వార్డు పుచ్చలమెట్ట మసీదు వద్ద ముస్లిం సోదరులు పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , టిడిపి యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో సౌహార్ద వాతావరణంలో కలిసి ఉపవాస విరమణ చేసి, వారికి రమజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు నూతన వస్త్రాలను బహుకరించి తమ ఆదరణను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వరికూటి నాగరాజు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు చిన్నా, ఒంగోలు పార్లమెంట్ టిడిపి కమిటీ సభ్యులు పఠాన్ సుభాని, టిడిపి నాయకులు అల్లా బక్షు, ఎస్.కె. సుభాని, షేక్ బుజ్జి, షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ ఇమ్రాన్ మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా జరిగిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం సామాజిక ఐక్యతను మరింత బలపరిచింది.