తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ పి. రాజా బాబు ని కలిసి తమ సమస్యను వివరించారు.2014 నుండి సింగరాయకొండ గ్రామంలోని ఇనాం భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందనీ దీని వల్ల భూముల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ ని కోరారు.కలెక్టర్ రాజాబాబు సదరు సమస్యపై సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకొని సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *