విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవండి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం:-
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన,డిబేట్ పోటీలలో విజేతలగా నిలిచిన వారికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు నగదు బహుమతులను మరియు ప్రశంస పత్రాలను అందచేసినారు. పోలీస్ సిబ్బందికి “ప్రస్తుత కాలంలో పోలీసు వ్యవస్థలో సాంకేతికత పాత్ర”, విధ్యార్థులకు “లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర”అనే అంశాలపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ. 5 వేలు… ద్వితీయ బహుమతి రూ. 3 వేలు… తృతీయ బహుమతి రూ. 2 వేలు ప్రకారం నగదు బహుకరించారు.వ్యాస రచన స్కూల్/కాలేజీ విద్యార్థులలో విజేతలు:
1st వై.జాన్సీ, (10th క్లాస్, DRRM హై స్కూల్, ఒంగోలు)
2nd వి.అను (9th క్లాస్, వి.బి.వి.స్కూల్, దొనకొండ),
3rd ఐ.పూజిత (10th క్లాస్, ZPH హై స్కూల్, మర్రిపూడి).వ్యాస రచన పోలీస్ సిబ్బందిలో విజేతలు:
1st రామ మూర్తి (HC.1816, ఒంగోలు టు టౌన్ పియస్),
2nd జి. యోనా (PC – 1186, స్పెషల్ పార్టీ),
3rd R.K కుమార్ (HC.531, మద్దిపాడు పీఎస్).వ్యాస రచన పోలీస్ పిల్లలు విజేతలు1st కె.మనోగ్న D/o కె.రత్తయ్య, పిసి.1523,DAR,ఒంగోలు(10th క్లాస్, అపెక్స్ హై స్కూల్)
2nd సాయి నిహారిక D/o పవన్ కుమార్, PC.701 యస్.యాన్ పాడు పియస్, (నారాయణ ఈ -టెక్నో, హై స్కూల్, 9th క్లాస్)
3rd హీనా D/o బాబురావు,PC.3935 DAR,ఒంగోలు. (10th క్లాస్, అపెక్స్ హై స్కూల్)డిబేట్ కాంపిటీషన్ లో స్కూల్/కాలేజీ విద్యార్థులలో విజేతలు
1st కె.అర్చన, (9thక్లాస్,గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఒంగోలు) 2nd యన్.చంద్రిక (9th క్లాస్,గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఒంగోలు),3rd జాయ్ శ్రీ (10th క్లాస్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఒంగోలు).ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరులకు నివాళిగా వారి త్యాగాలను యువతకు పరిచయం చేయడానికి నిర్వహిస్తున్న ప్రేరణాత్మక కార్యక్రమాల్లో వ్యాసరచన పోటీలు ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ వ్యాసరచన పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా రాసారని విజేతలను అభినందించారు. విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు క్రీడల్లో పాల్గొని సృజనాత్మక ప్రతిభను వెలికితీయాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, డి.సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
