తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకొని, ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు.మాదకద్రవ్యాలను గుర్తించే జాగిలం సహాయంతో ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా పూర్తిగా పరిశీలించారు. ఈ క్రమంలో రైలు నెం. 18189 – ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు నుంచి కావలి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ కు చెందిన 1)శుకుల్ కుమార్ ఉరాన్(26 సం),2) బలరామ్ ఉరన్వ్ (26 సం),3)కమలేష్ ప్రసాద్ యాదవ్(33 సం) అనే ముగ్గురు అనుమానితులను ఉండే ప్రదేశంలో 6 కేజీల గంజాయిని, అదే విధంగా ఒడిషా,బెంగాన్, కలహండికు చెందిన 1) చంద్రదొర (34 సం’), రఘునాథ్ దొర(34 సం’), 3)రమేష్ దొర (36 సం’) ఉండే ప్రదేశములో 7 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని, ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోని, తదుపరి దర్యాప్తు నిమిత్తం జి.ఆర్.పి పోలీసులకు అప్పగించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు సుదర్శన్,చెంచయ్య, ఈగల్ టీం సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *