– కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ప్రత్యేక చొరవ.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు ఎమ్మెల్యే:-
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడ, తాడేపల్లిలో విడవలూరు మండలం, ఊటుకూరు పంచాయతీ, కంచరపాలెం గ్రామానికి చెందిన పామర్తి రూప అనే మహిళ కుమార్తె 7 రోజుల పసిపాప చికిత్స కోసం రూ.3,51,847 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌ఓసీ (Letter of Credit)ను కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్వయంగా అందజేశారు.పసిపాప తక్కువ బరువుతో, పూర్తిస్థాయి ఎదుగుదల లేక తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. పాపను కాపాడుకునేందుకు సుమారు 2 నుంచి 3 నెలల పాటు ఆస్పత్రిలోని ఐసీయూ (ఇన్క్యుబేటర్/బాక్స్)లో ఉంచి చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. నెల్లూరులోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారికి వైద్య ఖర్చులు భారీగా కానుండటంతో, అంత మొత్తం భరించే స్థోమత లేక కుటుంబ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆశ్రయించారు.కుటుంబ పరిస్థితిని, ఆ పసికందు ఆరోగ్య తీవ్రతను చూసి తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే గారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, పాప చికిత్స కోసం రూ.3,51,847 విలువైన సీఎంఆర్‌ఎఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC)ను మంజూరు చేసింది.