తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసులతో పాటు మార్కాపురం జిల్లా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ డ్రైవ్‌లో భాగంగా బస్సులలో అన్ని అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలను (డాక్యుమెంట్లు) సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు.అదేవిధంగా డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) పరీక్షలు నిర్వహిస్తూ, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బస్సులలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నదానిపై కూడా సమగ్రంగా తనిఖీలు చేపడుతున్నారు.ఈ చర్యల ద్వారా ప్రయాణికుల ప్రాణ భద్రతను కాపాడటం, ప్రమాదాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అన్ని ట్రావెల్స్ నిర్వాహకులు మరియు డ్రైవర్లు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *