తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణానికి చెందిన బీసీ నాయకుడు చిలకపాటి మధు… రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని బిసి భవన్ లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతి… సభ్యులందరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చిలకపాటి మధు మాట్లాడుతూ… తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నాయకులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తనపై ఎంతో నమ్మకంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, కందుకూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, బీసీల ఐక్యతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మధు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. చిలకపాటి మధు ప్రమాణస్వీకారానికి కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం మధును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ వడ్డెళ్ళ రవిచంద్ర, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీనివాసరావు, చుండూరి శ్రీను, రావూరి రామకోటయ్య, గొల్లపూడి శ్రీనివాసరావు, షేక్ షరీఫ్, మాదాల రవీంద్ర, పూజల పున్నారావు తదితరులు పాల్గొన్నారు..