తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రజల చెంతకు పాలనను తీసుకెళ్లి, గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయడమే మన కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇందులో భాగంగా మంగళవారం లింగసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో పాల్గొని, మండలంలోని 14 పంచాయతీలకు చెత్త సేకరణ కోసం 16 రిక్షాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అంతర్గత మరియు లింకు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా మరియు స్మశాన వాటికల అభివృద్ధి పనులను వెంటనే గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించాను. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ఎటువంటి జాప్యం జరగకూడదు.ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరవేయడం అధికారులు మరియు ప్రజాప్రతినిధుల కనీస బాధ్యత. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికి, నాకు చెడ్డ పేరు వస్తుందని, అటువంటి తీరును సహించేది లేదని హెచ్చరించాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. వారి సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా మన నియోజకవర్గ తాగునీటి అవసరాల కోసం రెండు విడతల్లో రూ. 45 కోట్లు, అలాగే చెరువుల అభివృద్ధికి రూ. 9 కోట్ల నిధులను తీసుకురావడం జరిగింది.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు నేను నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం నుంచి మనం అడిగిన వెంటనే నిధులు మంజూరవుతున్నాయి, కాబట్టి క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగాలి. కందుకూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించకుండా కష్టపడదాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *