తొలి శుభోదయం సింగరాయకొండ :-
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని తూర్పు నాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో ములగుంటపాడు గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామంలోని సర్వే నంబర్ 108/3 లో గత సంవత్సరం నుండి కొనసాగుతున్న భూమి రిజిస్ట్రేషన్ నిషేధం తొలగిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం, తదనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పునఃప్రారంభం కావడంతో మంత్రి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, ములగుంటపాడు టిడిపి సీనియర్ చిగురుపాటి శేషగిరి, నాయకులు సన్నెబోయిన మల్లికార్జున, నరాల సుధాకర్, పంచాయతీ వార్డు సభ్యులు అంబటి శ్రీనివాసులు, సన్నెబోయిన వెంకటరావు, నక్కా ముసలయ్య, సన్నెబోయిన రమేష్, చల్లా శ్రీను, కంకణాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.