తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు సబ్ డివిజన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ రావు ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ యూఏ కేసులు, గర్ల్ మిస్సింగ్ కేసులు, పెండింగ్ కేసుల పరిష్కారం, రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్ల కదలికలపై సమీక్షించారు.డీఎస్పీ మాట్లాడుతూ —లా & ఆర్డర్ పరిస్థితులు సుజావంగా కొనసాగేలా అన్ని అధికారులు సమన్వయంతో పని చేయాలని,
గ్రామాల స్థాయిలో పోలీసులు నిరంతరం కదలిక కొనసాగించాలని,
ఎన్ఫోర్స్మెంట్ చర్యలను రోజువారీగా కొనసాగిస్తూ నేరాలను అరికట్టాలని సూచించారు.అదేవిధంగా, క్రైమ్ కంట్రోల్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజల భద్రత, శాంతి భద్రతను కాపాడడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతగా భావించాలని ఆయన ఆదేశించారు.