తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

ప్రకాశం జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్ లో మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గంజి గోపిరాజు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిబాపూలే గొప్ప సంఘ సేవకుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన కుల వ్యవస్థ కు వ్యతిరేకం గా పోరాటం చేసాడు అని కొనియాడారు అంతే కాకుండా క్రింది కులాల ప్రజలకు సమాన హక్కులు కోసం సత్య శోదక్ సమాజ్ ను ఏర్పాటు చేసారు.. విద్య అనేది ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని విద్య ద్వారానే అణగారిన వర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుంది అని నమ్మిన వ్వక్తి.. తన సహా ధర్మచారిణి సావిత్రి బాయి పూలే గారిని ఉపాధ్యాయ రాలిగా తీర్చి దిద్ది ఆమె ద్వారా మహిళా సమాజానికి విద్యను అందించిన మహోన్నత శక్తీ మహాత్మా పూలే గారు అంబేద్కర్ గారు తన ఉద్యమ గురువులలో ఒకరిగా జ్యోతిరావు పూలే గారిని ఎంచుకోవడం మనం మరువకూడదు. అలాగే కాన్షిరాం గారు బహుజన సమాజ్ పార్టీ ని స్థాపించినపుడు పార్టీ సిద్ధాంత కర్తలలో ఒకరిగా జ్యోతిరావు పూలే ని ఎంచుకొన్నారు.. అని ప్రకాశం జిల్లా అధ్యక్షులు గంజి గోపిరాజు అన్నారు.. ఈ కార్యక్రమం లో అద్దంకి నియోజకవర్గం నుండి బండి విజయకుమార్, మందా జోసెఫ్ , సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పైనం జాన్ బాబు , కందుకూరు నియోజకవర్గం నుండి డాలు శివశంకర్ మరియు జిల్లా కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *