తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన వేగంగా డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వాహనాలపై అనధికారికంగా అమర్చిన అధిక వెలుతురు LED లైట్ల వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు అనధికార LED లైట్లను గుర్తించి తొలగిస్తూ చర్యలు చేపట్టారు. వాహనదారులు చట్టబద్ధమైన మార్పులు మాత్రమే చేయాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు.
