google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

దొంగతనాలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియాకు సీఐ సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుబయట నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటిపైన విలువైన వస్తువులు ధరించి బయట నిద్రించరాదని అన్నారు. మీ విలువైన వస్తువులను ఇంట్లో భద్రపరుచుకోవాలన్నారు. అలానే ఆలయాలలో చోరీలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటిస్తూ ఆలయాలలో రోజు రాత్రి ఒకరు నిద్రించేలా చూసుకోవాలన్నారు హుండీలలో ఉన్న నగదు ఎప్పటికప్పుడు హుండీ నుంచి తీసివేయాలని దేవతామూర్తులకు అలంకరించిన బంగారం, వెండి ఆభరణాలను లాకర్ లో భద్రపరచాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలానే మీ గ్రామా పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ సురేష్ ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *