google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి నిర్వహించిన సమావేశంలో రాబోయే ‘మహానాడు’ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న మన పార్టీ పండుగ పసుపు పండుగను దిగ్విజయం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాను. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కందుకూరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మన ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా కోరాను.మహానాడు స్ఫూర్తితోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మనం సిద్ధం కావాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి గ్రామంలోనూ గెలుపు లక్ష్యంగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని నేతలకు సూచించాను. ముఖ్యంగా ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువు అని, మీ కష్టానికి తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చాను. మనమందరం సమిష్టిగా కృషి చేసి కందుకూరు గడ్డపై తెలుగుదేశం జెండాను రెపరెపలాడిద్దాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *