google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గిద్దలూరు పట్టణంలోని యూటిఎఫ్ కార్యాలయంలో అమరజీవి దాచూరి రామిరెడ్డి వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం జిల్లా కార్యదర్శి డాక్టర్ మొర్రి. పిచ్చయ్య అధ్యక్షత వహించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నాయకులు రవీంద్రారెడ్డి అమరజీవి దాచూరి రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కౌన్సిలర్ రమణారెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి రంగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు తోట కృష్ణయ్య తదితరులు దాచూరి రామిరెడ్డి యూటీఎఫ్ సంఘ పటిష్టతకు, డైరీ ,అధ్యాపక దర్శినిలో ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి మాధవి దేవి, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ వేమయ్య,ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, గిద్దలూరు, రాచర్ల ,కొమరోలు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, బాల వెంకటేశ్వర్లు,రఘురాం,రంగారెడ్డి, వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు జయ చంద్రారెడ్డి,మహానంది రెడ్డి,రంగ నాయకులు, వెంకటేశ్వరరెడ్డి, ఈ.వెంకటేశ్వర్లు, నాగరాజు ,మూడు మండలాల బాధ్యులు, సభ్యులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. దాచూరి.రామిరెడ్డి ఆశయ సాధన కోసం ప్రభుత్వ పాఠశాల ఎన్రోల్మెంటు డ్రైవ్ సమర్థవంతంగా నిర్వహించాలని, పాఠశాలలో ఒక గంట అదనంగా పనిచేయాలని జిల్లా కార్యదర్శి డాక్టర్ మొర్రి. పిచ్చయ్య పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *