google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా, ICDS శాఖ మరియు MPDO సమన్వయంతో మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాలు, పిల్లలపై దాడులు, POCSO Act గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. అలాగే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, విద్య యొక్క ప్రాముఖ్యత, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.పిల్లలు మరియు మహిళలు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి అనే విషయాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సమాజంలో చైతన్యం పెంపొందించడంతో పాటు, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *