తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఒంగోలు ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక చర్యలు చేపట్టారు. మంగమూరు జంక్షన్ మరియు చర్చ్ సెంటర్ ప్రాంతాలను R&B జేఈ నాగార్జున మరియు సిబ్బందితో కలిసి పరిశీలించి, లేన్ డిసిప్లిన్ కోసం రోడ్ మార్కింగ్ మరియు ఇతర అవసరమైన మార్పులపై చర్చించారు.అదేవిధంగా, కోతపట్నం బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై కౌన్సిలింగ్ నిర్వహించి, యూనిఫాం, ప్రవర్తన మరియు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు.ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సిబ్బంది సహాయంతో పుష్‌కార్ట్‌లు మరియు అక్రమ ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ ప్రవాహాన్ని సజావుగా మార్చారు. ఈ చర్యలతో ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది.ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.