google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారెడ్డిపాలెం లారీ యూనియన్ కార్యాలయంలో జూదం జరుగుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఎస్సై టంగుటూరు గారి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,640 నగదు మరియు 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో జూదం నిర్వహణకు సంబంధించిన ఇతర ఆధారాలను కూడా సీజ్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *