google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతిఏటా ఘనంగా జరుపుకునే మహానాడు – 2026 పండుగ… ఈనెల 27,28,29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో, జాతీయ రహదారి పక్కన కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగబోతోంది. మహానాడు వేదిక, ఇతర పనులకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమం బుధవారం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర , ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ , సహచర శాసనసభ్యులతో కలిసి… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.MLA నాగేశ్వరరావు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఐకమత్యంతో, మహానాడును దిగ్విజయంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కందుకూరు నియోజకవర్గం నుంచి వేలసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేస్తామని చెప్పారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *