google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.ఎస్‌ఐ పామూరు , రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామంలో ఓపెన్ బూజింగ్ ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు.అలాగే గిద్దలూరు పట్టణంలో కూడా బహిరంగ మద్యం సేవనానికి ఉపయోగిస్తున్న ప్రాంతాలను శుభ్రపరిచి ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్‌.ఆర్‌.పల్లి ప్రాంతంలో కొమరోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలను తొలగించారు.ఇక కేకే మిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నరికట్ల గ్రామంలో కూడా ఎస్‌ఐ ఆధ్వర్యంలో బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామ ప్రజలకు మద్యం దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *