తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఒంగోలు డిఎస్పి శ్రీ రాయపాటి శ్రీనివాస్ రావు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్లపై నిర్లక్ష్యంగా వెహికిల్స్ నడుపుతున్న మైనర్ బాలురను, వారి తల్లిదండ్రులతో కలిసి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల తలెత్తే ప్రమాదాలు, ప్రాణ నష్టం, చట్టపరమైన పరిణామాలు గురించి విపులంగా వివరించారు.మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, పిల్లలపై ప్రమాద భయం మాత్రమే కాక కాదు, తల్లితండ్రులపై కూడా చట్టపరమైన బాధ్యతలు వస్తాయని చెప్పారు.హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు.భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని పిల్లలకు సూచించి, తల్లిదండ్రులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.డిఎస్పి ప్రజల ప్రాణ భద్రత కోసం పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కౌన్సిలింగ్ తీసుకున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *