కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ నుండి ఈస్టర్న్ ఛానెల్‌కు సాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఈ ఛానెల్ ద్వారా సుమారు 60 శాతం సాగుభూమికి, అలాగే రెండో పంటకు నీటి సరఫరా అందుతుంది.సుమారు 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ జలాశయం బ్రిటీష్ కాలంలో నిర్మించబడింది. పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు సంగం, కావలి, దగదర్తి మండలాలకు కూడా సాగునీరు అందుతోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాము. పంటకాలువల మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్లు మరియు గేట్ల ఆధునీకరణ, గట్ల బలోపేతం, ఇన్‌స్పెక్షన్ గ్రావెల్ రోడ్ల నిర్మాణం వంటి మొత్తం 524 పనులకు రూ.42 కోట్లు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *