ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు బృందాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించాయి.ఈ తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రివేళల లైటింగ్, సెక్యూరిటీ గార్డుల విధులు వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్కిమ్మింగ్ పరికరాల ద్వారా మోసాలు జరగకుండా బ్యాంకు అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.ప్రజలు నగదు ఉపసంహరణ సమయంలో అపరిచితుల సహాయం తీసుకోవద్దని, తమ ATM PIN వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.
ప్రజల ఆస్తుల రక్షణ, ఆర్థిక భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం & మార్కాపురం పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *