ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, మహిళలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ICDS చిన్నారులు, అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, కొత్త క్రిమినల్ చట్టాలు, సైబర్ భద్రత, సైబర్ మోసాలు, POCSO చట్టం, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించే అవసరం, మహిళల భద్రత, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, NDPS చట్టం, సైబర్ క్రైమ్ నివారణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళలపై జరిగే నేరాలు, వేధింపులు లేదా సైబర్ మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, యువత గంజాయి మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమని, చట్టాలపై అవగాహనతో నేరాల నివారణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *