మాదిగల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని నిలిపిన MRPS ఉద్యమ పురిటిగడ్డ ఈదుమూడిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా..” మాదిగల పుణ్యక్షేత్ర ” శంకుస్థాపన మహోత్సవ జాతరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ, నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, అధికారికంగా ప్రారంభమయ్యాయి!MRPS అధినేత, బ్రహ్మన్న స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ, పుడమి పనులకు అంకురార్పణ చేశారు. నాయకుడే స్వయంగా కార్యాచరణలోకి దిగడం క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలలోనూ, సమాజంలోనూ నూతనోత్తేజాన్ని, కొండంత ధైర్యాన్ని నింపింది.మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన జాతర ఏర్పాట్లలో భాగంగా. ఈరోజు ఈదుమూడి గ్రామ పెద్దలు, వ్యవస్థాపక సభ్యులు క్షేత్ర ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టి, శుభసూచకంగా నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ పవిత్ర యజ్ఞంలో బ్రహ్మన్న గారి కుమార్తెలు అక్షయ మరియు ఐశ్వర్య కూడా ఉత్సాహంగా పాల్గొని, తమ వంతు శ్రమదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమం ఈదుమూడి గ్రామ పెద్దలు మరియు MRPS వ్యవస్థాపక సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *