తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సుమారు 90 లక్షల రూపాయల నుడా నిధులతో, శ్రీ అంకమ్మ తల్లి ఆలయం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు సీసీ రోడ్డు విస్తరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 30 అడుగుల రోడ్డును మరో 20 అడుగులకు పైగా వెడల్పు చేయడం ద్వారా వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పనుల పరిశీలనలో భాగంగా, డ్రైనేజీ కాలువలకు అవసరమైన చోట రిపేర్లు చేసి స్లాబ్ వేయాలని, అలాగే ఆర్టీసీ డిపోలోకి బస్సులు సులభంగా వెళ్లేలా అక్కడ మరో 10 అడుగుల మేర రోడ్డును అదనంగా విస్తరించాలని అధికారులను ఆదేశించాను.రానున్న రోజుల్లో రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కోవూరు రోడ్డులోని ప్రకాశం పంతులు గారి విగ్రహం వరకు రోడ్డు విస్తరణను కొనసాగిస్తాం. అంతేకాకుండా, పట్టణంలోని ప్రధాన జంక్షన్లయిన బాలుర హైస్కూల్, కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ మరియు పామూరు బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం ఒక్కొక్కటి 2.5 లక్షల వ్యయంతో అధునాతన బస్సు షెల్టర్లను నిర్మించబోతున్నాం. ఏళ్ల తరబడి పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ కందుకూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.