బాపట్ల జిల్లా బాపట్ల మండలం 32 వ వార్డు నరాలశెట్టివారి పాలెం నందు గల రాష్ట్ర త్రి దళ మాజీసైనికుల సంక్షేమ ముఖ్యాలయ లీగ్ వారి సెంట్రల్ హబ్ ద్వారా ఝటిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గతం లో లాగానే ఈ రోజు కూడా రుజువుచేయబడింది. తన ఒక్కగానొక్క కుమారుడు 1996 వ సం లో వాయుదళం లో చేరి 18 సం లు దేశ సేవ చేసి అనారోగ్యంతో ఉద్యోగం లో ఉన్నప్పుడు మరణించగా కుటుంబ కలహాల కారణంగా తనకు అందవలసిన హక్కులు మరియు సంక్షేమ పధకాలు అందలేదని తన అనారోగ్య పరిస్థితులలో పట్టించుకొనేవారు లేరని బంధువులే తనను ఒంటరిదానిని చేసి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతున్నారని కొల్లూరు మండలం దోనేపూడి నివాసి కృష్ణ కుమారి కళ్లనీళ్లు పెట్టుకొని తన గోడు రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి వర ప్రసాద్ కి వినిపించగా, వెంటనే స్పందించి ఢిల్లీ లో గల 8 విభాగాలవారితో సంప్రదించి వివరాలు సేకరించి వాటిని పొందుపరచి 5 గం లలో హెల్త్ కార్డు ను మంజూరు చేయించి నాకు అందించారని ఆనంద భాష్పాలతో ధన్యవాదములు తెలిపారు. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం రాష్ట్రం లో అనేక మంది చేస్తారని కానీ కొన్ని సమస్యలు పరిష్కరించటంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందని వాటిని పరిష్కరించుటలో పూర్తి అవగాహన మరియు విషయానికి సంబంధించిన పరిజ్ఞానం చాల అవసరమని వర ప్రసాద్ చెపుతూ వచ్చిన వారి సమస్యలను పరిష్కరించి సంతోషంగా వారి ని పంపటం లో మాకు ఆనందం కలుగుతుందని మాజీసైనికుల సేవయే మా సెంట్రల్ హబ్ యొక్క ప్రధాన లక్ష్యం అని అంటూ ఒకరి సమస్యను పరిష్కరించుటలో మాకు గర్వం గా భావిస్తామని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఒకటిన్నర సంవత్సరం నుండి తిరుగుతున్న నాకు ఈ రోజున పరిష్కారమైనదని సేవలందుకున్న కృష్ణకుమారి కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మంత్రు నాయక్, ముఖ్య కార్యదర్శి మదన్ మోహన్, సంయుక్త కార్యదర్శి ఇషయ్య, కోశాధికారి ఆర్ ఆర్ వి రెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ సబ్యులకు ధన్యవాదములు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *