స్థానిక సాయిరాం పెయింట్స్ (ఎంఆర్ఎఫ్ ఆథరైజ్డ్ డీలర్) ఆధ్వర్యంలో పెయింటర్ల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ఎఫ్ పెయింట్స్ సేల్స్ ఆఫీసర్ మణికంఠ మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంఆర్ఎఫ్ పెయింట్స్ తనదైన ముద్ర వేస్తోందని పేర్కొన్నారు. ఇతర బ్రాండ్లకు ధీటుగా, సామాన్యులకు అందుబాటులో ఉండే తక్కువ ధరలో అత్యధిక మన్నికైన పెయింట్స్ అందించడం తమ బ్రాండ్ ప్రత్యేకతని ఆయన వివరించారు. తక్కువ ధరలో నాణ్యమైన ఫినిషింగ్ రావడం వల్ల ఇంటి యజమానులకు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, కేవలం వ్యాపారమే కాకుండా, పెయింటర్ల సంక్షేమం కోసం కంపెనీ అనేక రకాల స్కీమ్స్ మరియు ప్రోత్సాహకాలను ఎంఆర్ఎఫ్ అమలు చేస్తోందన్నారు. సమావేశం అనంతరం పెయింటర్ల వృత్తి పట్ల గౌరవార్థం వారికి ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం సాయిరాం పెయింట్స్ నిర్వాహకులు పెయింటర్లందరికీ విందు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు పెయింటర్లు మరియు గిద్దలూరు సాయిరాం పెయింట్స్ శేఖర్రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *