నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరుగుతున్న మహానాడు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహణ కమిటీ కీలక సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, డోల బాల వీరాంజనేయ స్వామి తదితరులతో పాటు రక్తదాన కమిటీ సభ్యురాలిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.మహానాడు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరం విజయవంత నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన ఏర్పాట్లు, సేవా కార్యక్రమాల సమన్వయం వంటి అంశాలపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.ప్రజాసేవా కార్యక్రమాలకు మహానాడు వేదికగా నిలవాలని, రక్తదానం ద్వారా ప్రాణదానం అనే మహోన్నత సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *