ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న “తెలుగుదేశం మహానాడు” సన్నాహక సమావేశంలో బుధవారం పాల్గొనడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించాము.ఈసారి మహానాడు వసతుల కమిటీ (Accommodation Committee) సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. వేడుకకు వచ్చే అగ్రనేతలు, వీఐపీలు, అతిథులు మరియు లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భోజన, వసతి, రవాణా సౌకర్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాం.ముఖ్యంగా మన కందుకూరు నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ మహానాడుకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. కమిటీ సభ్యులందరం సమన్వయంతో పనిచేసి, ఈ పసుపు పండుగను తెలుగుదేశం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్వహిస్తాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *