తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించడం, నేరాల నివారణపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారు మరియు పోలీస్ సిబ్బంది కలిసి స్పైస్ స్కిల్స్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, POCSO చట్టం, సైబర్ నేరాలు మరియు సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పాటింపు, గంజాయి మరియు మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులు, శిక్షణార్థులకు అవగాహన కల్పించారు.మహిళలు, చిన్నారులపై జరిగే వేధింపులు లేదా అన్యాయాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సోషల్ మీడియా మరియు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.