తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రజా మార్పు సింగరాయకొండ ప్రతినిధి టి సతీష్
ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు , ఒంగోలు డి.ఎస్.పి ఆదేశాల మేరకు సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీహరి సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని డాబాలు హోటల్స్ షాపుల నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు సూచించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు నివారణ మరియు దొంగతనాల గురించి వారితో ప్రత్యేక సమావేశం కావడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాత్రి 11 గంటలకు ఎట్టి పరిస్థితిలో షాపులు మూసివేయాలని సూచించారు. షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాచ్మెన్ లను నియమించాలని సూచించారు. ఏదైనా షాపు ఎదురుగా ఆ షాపు యజమాని నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ జరిగినచో ఆ షాపు యొక్క యజమానిని కూడా బాధ్యుణ్ణి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాచర్ల, ఏఎస్ఐ శేషారెడ్డి , హైవే మొబైల్ పోలీస్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు