తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ సీఐ శ్రీహరి సూచించారు. బంగారు దుకాణదారులతో గురువారం సీఐ తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. దుకాణాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్నారు. నమ్మకమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అనుమానస్పద కదలికల వ్యక్తులను గమనించాలన్నారు….