తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ నూతనంగా నియమించబడిన సబ్ ఇన్స్పెక్టర్ (Si) లేళ్ళ సుదీర్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేష్ గారు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్, అవినీతి రహిత సమాజాన్ని స్థాపించాలి, అక్రమ గంజాయి పై, రౌడీ షీటర్ల పై,నేరస్తుల పై,పోకిరిలపై, ట్రాఫిక్ సమస్యలపై, ఉక్కు పాదం మోపి ప్రజలకి లా అండ్ ఆర్డర్ పై మరింత నమ్మకం కలిగేలా చూడాలని సింగరాయకొండ మండలంలో ప్రజలకి ఎక్కడైనా సమస్య ఉంది అంటే పోలీస్ పవర్ చూపించాలని, అదేవిధంగా ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుండి కూటమి ప్రభుత్వం తరుపున si సుదీర్ కుమార్ గారికి తెలియజేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ , సీనియర్ జర్నలిస్ట్ సంగు వసంతయ్య , కార్యదర్శిలు అనుముల శెట్టి కిరణ్ బాబు , గుంటుపల్లి శ్రీనివాసరావు , ప్రచార కార్యదర్శి తగరం రాజు , శీలం జగదీష్ , పసుమర్తి నాగేశ్వరరావు, మరియు టీడీపీ మండల అధ్యక్షులు మించల బ్రహ్మయ్య, సుదర్శి చంటి, బ్రహ్మేశ్వర రావు, పసుపులేటి శేషు, మాలకొండయ్య, కూటమి నాయకులు పాల్గొనడం జరిగినది.