తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఓపెన్ బూసింగ్ చేసే వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా, ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఓపెన్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి, అలాంటి చర్యలు చట్టపరంగా తప్పని, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని అవగాహన కల్పించారు.అదేవిధంగా, మద్యం సేవించిన ప్రదేశాన్ని వారికి స్వయంగా శుభ్రం చేయించి, ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతపై సూచనలు ఇచ్చారు.ఒంగోలు తాలూకా ఎస్ఐ ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.